యా కుందేందు తుషార హార ధవలా యా శుభ్రవస్త్రావృఇతా యా వీణా వరదండ మండితకరా యా శ్వేతపద్మాసనా !
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభ్రుతిభి ర్దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష్హ జాడ్యా పహా !!
"హితేన సహితం సాహిత్యం" హితం తో కూడిన దే సాహిత్యమయితే, అలాంటి హితాన్ని నిర్విరామం గా సాగేటట్లు గా చూడటం సమాజం లోని ప్రతి సాహితీ ప్రియుని విధి.
ఆదికవి ని మెధలుకొని ఆధునిక సాహిత్యం వరకు ఎంధరో తెలుగు కవులు, అలాగే తెలుగు వ్యాకరణం,తెలుగు పద్యాలు,వివిధములైన సహిత్య ప్రక్రియలు,దొరణులు,విశేషాలు,తెలుగు ప్రముఖులు,మంచి రచనలు,పుస్తకముల వివరాలు ... ఇలా అన్నింటిని ఒకే చోట ఏరి కూర్చాలని.. ఈ భాషా ఉద్యమం లో "నేను సైతం" మరింత వైరుధ్యం తో కూడిన సమాచారం అంధరితో పంచుకోవాలని ..ఈ చిరుప్రయత్నం.ఈ తెలుగు వెలుగు ల సాగు లో మీ సూచనలు సలహాలు నాకు అమూల్యములు .
ఈ సంధర్బం గా తెలుగు బ్లాగాకరులకి,చదువరులకి,ప్రేరణ కలిపించిన ప్రతి రచన కి,రచయితలకి, ప్రత్యేకం గా రేడియో,టి.వి. లలో తెలుగు సాహిత్య కర్యక్రమాలని అందిస్తున్న వారికి కృతజ్ఞతల తో ....
చివర గా సమస్థ విజ్ణానానికి మూలమైన సరస్వతి దేవికి నమస్కరిస్తూ
(సహితి)వనమాలి
వేణు వింజమూరి